Hyper Aadi: పవన్ అభిమాని కావటం వల్లే ఆదికి ఆఫర్ లు రావటం లేదా?

Hyper Aadi: హైపర్ ఆది ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా హైపర్ ఆది దూరమైనట్లు తెలుస్తోంది.అయితే వచ్చే ఆదివారం మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో హైపర్ ఆది సందడి చేయనున్నారు అయితే ఇది చాలా రోజుల కిందట షూట్ చేసినదని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సరికొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చారు.వీడియో కాల్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది అభిమానులు వీడియో కాల్ ద్వారా తనని ఇరుకున పెట్టే ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా అభిమానులు హైపర్ ఆదిని ప్రశ్నిస్తూ మీరు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మీకు ఇతర హీరోల నుంచి ఆఫర్లు రావడం లేదా? అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్న విన్న హైపర్ ఆది ఒక్కసారిగా షాకయ్యారు. అయితే అభిమానులు అడిగిన ప్రశ్నకు హైపర్ ఆది ఎలాంటి సమాధానం చెబుతారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి అభిమానులు అడిగిన ప్రశ్నకు హైపర్ ఆది ఎలాంటి సమాధానం చెబుతారో తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాలి.