ఆదిపురుష్ రేస్ నుంచి దిల్ రాజు అందుకే తప్పుకున్నాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో రామాయణం కథ ఆధారంగా ఆవిష్కరించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. ఇక ఈ మూవీకి సంబందించిన ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జూన్ 6న గ్రాండ్ గా జరగబోతోంది. దీనికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామీ రాబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. ఏకంగా 185 కోట్లు కోట్ చేసి ఆదిపురుష్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఆదిపురుష్ మూవీ రైట్స్ కోసం దిల్ రాజు కూడా పోటీ పడ్డారు. నైజాం, ఉత్తరాంద్ర హక్కుల కోసం ఎక్కువ మొత్తంలోనే దిల్ రాజు ఆఫర్ చేశారు. అయితే అంతకంటే ఎక్కువ మొత్తం పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ మొత్తం తెలుగు రైట్స్ కోసం కోట్ చేసింది.

దీంతో దిల్ రాజు ఈ మూవీ రైట్స్ విషయంలో వెనక్కి తగ్గారు. గతంలో దిల్ రాజు పెద్ద సినిమాలని డిస్టిబ్యూటర్ కి రిలీజ్ చేసిన అనుభవం ఉంది. అయితే వాటి ద్వారా పెద్దగా లాభాలు అయితే రాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తో భాగానే లాభపడ్డారు. కాని ఆదిపురుష్ మూవీ విషయంలో మాత్రం రిస్క్ చేయడానికి దిల్ రాజు సాహసించలేదు.

ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున ఆదిపురుష్ ని రిలీజ్ చేయడంతో పాటు పాటు గట్టిగానే ప్రమోషన్స్ చేస్తోంది. ఇక తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఖర్చు మొత్తం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చూసుకుంటుందని టాక్. ఈ ఈవెంట్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భం ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారంట. ఈ ట్రైలర్ ని కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ప్రెజెంట్ చేయబోతున్నారని టాక్. ఈ ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.