సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఫామ్ హౌస్ లో చేయకపోవడానికి అదే కారణమా?

టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖరుడు కృష్ణ నవంబర్ 15వ తేదీ తుది శ్వాస విడిచారు. ఇలా కృష్ణ మరణంతో సీనియర్ హీరోల శకం ముగిసింది.కృష్ణ మరణ వార్త తెలియగానే సినీ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక కృష్ణ మరణించడంతో ఆయన అంత్యక్రియలను పద్మాలయ స్టూడియోలో జరుగుతాయని అందరూ భావించారు.ఇక సీనియర్ హీరోలు అందరూ మరణించినప్పటికీ వారి అంత్యక్రియలను వారు నిర్మించిన స్టూడియోలోనే జరిగాయి.

ఈ క్రమంలోనే కృష్ణ అంత్యక్రియలను సైతం పద్మాలయ స్టూడియోలో నిర్వహిస్తారని అందరూ భావించారు. అయినప్పటికీ కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు మహేష్ బాబును తప్పుపడుతున్నారు.ఎవరు చెప్పినా వినకుండా కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు అంటూ మహేష్ పై నిప్పులు కురిపిస్తున్నారు. అయితే కృష్ణ అంత్యక్రియలు పద్మాలయ స్టూడియోలో కాకుండా మహాప్రస్థానంలో జరగడానికి గల కారణాలను కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ గారి అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించడానికి ఓ కారణం ఉంది అక్కడే తన భార్యఅంత్యక్రియలు జరగడంతో తన అంత్యక్రియలను కూడా అక్కడే చేయాలని కుటుంబ సభ్యులు భావించారని తెలిపారు. ఇకపోతే కృష్ణ గారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఒక మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగేఈ మెమోరియల్ హాల్ లో కృష్ణ గారి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తను నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు వాటి డీటెయిల్స్ కూడా పెట్టనున్నట్లు వెల్లడించారు.