కోవై సరళ హాస్య నటి. ఈ పేరు వింటే బ్రహ్మానందం ఈమె కలిసి నటించిన సినిమాలు గుర్తుకు వస్తాయి. తన నటనకు తన వాయిస్ ముఖ్య ఆధారం. అందుకే తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. ఈమె 1962లో తమిళనాడులోని కోయంబత్తూర్ లో జన్మించారు. ఈయన తండ్రి ఒక మిలిటరీ ఆఫీసర్, తల్లి గృహిణి. ఈమెకు ఒక సోదరుడు, నలుగురు సోదరీమణులు ఉన్నారు.
కోవై సరళ విద్యాభ్యాసం అంతా కోయంబత్తూర్ లోనే జరిగింది. చిన్నప్పటి నుంచే సినిమాలలో నటించాలని చాలా కోరిక ఉండేది. చదువుపై ధ్యాస తక్కువ. నచ్చిన సినిమాలు చూడడానికి ఇంట్లో చెప్పకుండా వెళ్లి ఎవరికీ కనబడకుండా తిరిగి వచ్చేవారట. తాను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఏదైనా ఒక చిన్న పాత్ర అయినా చేస్తాను అవకాశం ఇవ్వండి అని తిరిగేదట. తన తండ్రితో నాకు చదువుపై ధ్యాస కంటే సినిమాలలో నటించాలని ఉందని గట్టిగా చెప్పేసింది.
ఆర్ కృష్ణ గారు దర్శకత్వం వహించిన వెల్లిరత్నం అనే సినిమాలో 1979లో ఒక చిన్న పాత్ర చేసింది. చిన్న పాత్ర అయినా బాగా నటించి తన నటనకు గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ముందనిముగించు అనే తమిళ్ సినిమాలో 30 సంవత్సరాల గర్భని స్త్రీగా అవకాశం వచ్చింది. ఇలా ఆమెకు వరుసగా చిన్నచిన్న అవకాశాలు ఎక్కువగా అమ్మ పాత్ర చేసే అవకాశాలు వచ్చిన ఆమె సినిమాలపై మక్కువతో అవకాశాలను విడిచి పెట్టేవారు కాదట.
1987లో మోహన్ బాబు నటించిన వీర ప్రతాపం సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. బ్రహ్మానందం, కోవై సరళ సన్నివేశం వచ్చినప్పుడు నవ్వకుండా ఉండడం చాలా కష్టం. ఆ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో మీకు నచ్చిన సినిమాలు ఏవి అని అంటే బ్రహ్మానందంతో కలిసి నటించిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా ఇంకా అల్లు అర్జున్ తో కలిసి నటించిన దేశముదురు సినిమాలు, లారెన్స్ తో నటించిన కాంచన సినిమా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది అని చెప్పుకొచ్చారు కోవై సరళ. ఈమధ్య ఆమె సినిమాలకు దూరం అవ్వడం జరిగింది కారణం ఏమని అడగక నాకంటే కామెడీ చేసేవారు ఇండస్ట్రీకి వస్తున్నారని సమాధానం ఇచ్చారు.
కోవై సరళ గారు తన అక్కచెల్లెళ్ల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. వారి పిల్లలను చదివించి విదేశాలలో సెటిల్ చేశారు. ఇలా తాను సంపాదించిందంతా తన కుటుంబ సభ్యులకే ఖర్చు చేసింది కోవై సరళ. కానీ తన ఆస్తి కోసం కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేస్తే నా దగ్గర డబ్బు ఏమీ లేదని మొత్తం వారికోసం, వారి పిల్లల చదువులకే ఉపయోగించారని చెప్తే బంధువులంతా ఆమెను విడిచి వెళ్లిపోయారు.