వయసు మీద పడితే ఛాదస్తం దానంతట అదే పెరిగిపోతుంది. నాగబాబుకి వయసు మీద పడలేదా.? రాఘవేంద్రరావుకీ వయసు మీద పడలేదా.? కేవలం తమ్మారెడ్డి భరద్వాజకే వయసు కారణంగా చాదస్తం పెరిగిపోయిందని అనడం కూడా సబబు కాదు. ఎక్కడో తేడా కొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ తన పైత్యాన్నంతా వెదజల్లారు. బహుశా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, అమెరికాలో సందడి చేయడాన్ని తమ్మారెడ్డి జీర్ణించుకోలేకపోయారేమో.
అంతే అయి వుంటుందన్నది సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జూనియర్ ఎన్టీయార్ కూడా అమెరికా వెళ్ళాడు. కాకపోతే, కాస్త లేటుగా. ఈలోగా అమెరికాలో రామ్ చరణ్ పేరు మార్మోగిపోయింది. మెగా కాంపౌండ్ అంటే తమ్మారెడ్డి భరద్వాజకి అస్సలు గిట్టదు. అదీ అసలు సంగతి. పేరుకే పెద్ద మనిషి.. ఆలోచనలు చాలా చాలా సిల్లీగా వుంటాయ్. తమ్మారెడ్డికి ఇది కొత్తేమీ కాదు. కాకపోతే, ఈసారి షాక్ గట్టిగా తగిలింది నాగబాబు నుంచీ, రాఘవేంద్రరావు నుంచీ. అదీ సంగతి.
ఈ మొత్తం వ్యవహారంపై చిరంజీవి కూడా కొంత ఆందోళన చెందినా లైట్ తీసుకున్నారట.