‘ఏజెంట్’ డిజాస్టర్.! సురేందర్ రెడ్డి ఒప్పుకోలేదా.?

‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ అయ్యిందని నిర్మాత అనిల్ సుంకర ఒప్పేసుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెబుతూ ఓ వివరణ కూడా ఇచ్చాడు. ఓ నిర్మాత ఇలా ప్రకటన ఇవ్వడం కొంత ఆశ్చర్యకరం.

తెరవెనుక అసలు ఏం జరిగి వుంటుంది.? నాగార్జున రంగంలోకి దిగి, డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా తన కుమారుడ్ని సేవ్ చేయడానికే ఇలా చేశాడా.? అన్నది ఓ డౌటానుమానం.

తప్పంతా తనదేనని దర్శకుడు సురేందర్ రెడ్డి ద్వారా ప్రకటన ఇప్పించాలని తొలుత అనుకున్నారట. అందుకు సురేందర్ రెడ్డి ఒప్పుకోలేదట. దాంతో, అనిల్ సుంకర ద్వారా ప్రకటన ఇప్పించారని సమాచారమ్.

పనిలో పనిగా, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా.. అనే ప్రస్తావన తెచ్చి, అందులో దర్శకుడు సురేందర్ రెడ్డిని ఇరికించేశారట.