తమిళంలో వరస ఆఫర్స్ అందుకుంటున్న సుధ కొంగర ..మాస్టర్ తర్వాత విజయ్ కూడా ..?

ప్రస్తుతం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ సుధ కొంగర పేరు వైరల్ గా మారింది. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో “సూరరై పొత్రు” అన్న సినిమా తెరకెక్కించిన సుధ కొంగర భారీ సక్సస్ ని అందుకుంది. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ముందు నుంచి ఈ సినిమా మీద సూర్య చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో సాలీడ్ హిట్ దక్కని సూర్య కి సుధ కొంగ బ్లాక్ బస్టర్ ఇచ్చి సూర్య స్టామినాని మరోసారి ప్రూవ్ చేశారు. ఇక ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అన్న పేరుతో రిలీజైంది. అంతేకాదు సూర్య కి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Aakasam Nee Haddura Review | Aakasam Nee Haddura Telugu Review

కాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషించడం విశేషం. ఇక ఈ సినిమాతో కేవలం ప్రేక్షకులనే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు సుధ కొంగర. కాగా ఈ సినిమాని ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జి.ఆర్. గోపీనాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కించడం గొప్ప విశేషం గా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడమే ఇంత భారీ సక్సస్ కి కారణం అని చెప్పుకుంటున్నారు.

కాగా ఇప్పుడు దర్శకురాలు సుధ కింగర కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా చూసి ఎంతో ఎమోషనల్ అయ్యాడు. త్వరలో మీతో కలిసి సినిమా చేయాలన్న ఆసక్తి ని బయట పెట్టాడు. ఇప్పటికే సుధ కొంగర తమిళంలో సూర్య సోదరుడు కార్తి హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. కాగా ఇప్పుడు థలపతి విజయ్ కూడా ఈ దర్శకురాలితో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. విజయ్ నటించిన మాస్టర్ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా రిలీజయ్యాక విజయ్ – సుధ కొంగర సినిమాకి సంబంధించిన సినిమా అప్‌డేట్ రానుందని సమాచారం.