వచ్చిన ప్రాజెక్టులు వచ్చినట్లే ఒప్పేసుకోవడం శ్రీలీల చేస్తున్న బిగ్ మిస్టేక్.. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చకు వినిపిస్తోంది. నిజమే.! స్టార్ అవ్వాలంటే ఆఫర్లు రావాలి. అలా అని వచ్చిన ప్రతీ ఆఫర్‌నీ తానే అంది పుచ్చుకోవాలనుకుంటే.! అది శ్రీలీల మాదిరే గందరగోళంగా తయారవుతుంది.
ఓ పక్క స్డడీస్.. ఇంకో పక్క కెరీర్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. అలాంటిది శ్రీలీల.. అవేం ఆలోచించకుండా ఈ మధ్య డజన్ల కొద్దీ ఆఫర్లు సైన్ చేసేసింది.
తను ఎన్ని సినిమాలు చేయగలదు.? తన వద్ద వున్న టైమ్ ఎంత.? అని చూసుకోలేదు శ్రీలీల. దాంతో, చాలా చాలా ఇబ్బంది పడుతోందట.
ముఖ్యంగా ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్ శ్రీలీలపై చాలా చాలా గట్టిగా పడిందంటున్నారు. ఈ ఎఫెక్ట్‌తోనే తాజాగా కొన్నిమంచి ప్రాజెక్టులు వదిలేసుకోవాల్సి వస్తోందట శ్రీలీలకి.
ముఖ్యంగా శ్రీలీల వదిలేసుకున్న ఓ గుడ్ ప్రాజెక్ట్ రష్మిక మండన్నా చేతికి వెళ్లిపోయిందని తెలుస్తోంది. అలాగే ఇంకో ప్రాజెక్ట్ కృతి శెట్టి చేతికి వెళ్లబోతోందట. నిజానికి ఈ రెండు ప్రాజెక్టులూ గతంలో ఈ హీరోయిన్లు చేయాల్సినవే. శ్రీలీలకున్న క్రేజ్‌తో వీళ్లని కాదని ఆమె వద్దకి వచ్చాయ్.
ఇప్పుడు మళ్లీ శ్రీలీలని కాదని ఆ ముద్దుగుమ్మల్నే వెతుక్కుంటూ వెళ్తున్నాయంటున్నారు. శ్రీలీల చేతులారా చేసుకున్న తప్పిదమే ఇదంతా.. అని కొందరు సినీ మేథావులు మాట్లాడుకుంటున్నారు. ఇక నుంచైనా శ్రీలీల జాగ్రత్త పడితే మంచిదేమో.!