ఈ రెండు సినిమాలతో శృతి హాసన్ మళ్ళీ టాలీవుడ్ సక్సస్ ట్రాక్ ఎక్కుతుందా ..?

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ గోపీచంద్ మలినేని తో క్రాక్ అన్న హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ స్తుంది శృతిహాసన్. ఇక ఈ సినిమాకి సక్సస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా కంప్లీట్ కావచ్చింది.

Ravi Teja and Shruti Haasan's Krack Sankranti poster released | Telugu  Movie News - Times of India

ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా క్రాక్ రూపొందుతుండగా రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ .. సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా సక్సస్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని తో పాటు రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ శృతి హాసన్ కి చాలా కీలకం.

Shruti Haasan Rejected Pawan Kalyan Vakeel Saab Offer: Reason

ముఖ్యంగా శృతిహాసన్ కి ఈ సినిమా సక్సస్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అలాగే పవర్ స్టార్ తో కూడా శృతిహాసన్ హాసన్ వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలలో శృతిహాసన్ కనిపించనుంది అంటున్నారు. ఈ రెండు సినిమాల మీదే శృతిహాసన్ హాసన్ టాలీవుడ్ కెరీర్ ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు. రవితేజ వరస ఫ్లాపులతో ఉన్నాడు… వకీల్ సాబ్ లో గెస్ట్ రోల్ .. మరి ఈ రెండు సినిమాలు శృతిహాసన్ కి ఎంతమాత్రం కలిసి వస్తాయో చూడాలి.