రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2017 లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ రవితేజ కి హిట్ దక్కలేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో హిట్ అందుకొని ఫాంలోకి వచ్చాడు. ఈ సక్సస్ ఒక్క రవితేజ కి మాత్రమే కాదు దర్శకుడు గోపీచంద్ మలినేని తో పాటు హీరోయిన్ శృతిహాసన్ కి హిట్ ఇచ్చాడు రవితేజ. వాస్తవంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది శృతిహాసన్. కాని సీన్ రివర్స్ అయి క్రాక్ సినిమాతో వచ్చింది.
టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్ ఇక్కడ మళ్ళీ ఫాంలోకి వచ్చేసింది. అలాగే బాలీవుడ్ లో కూడా ది పవర్ అన్న సినిమా లో నటించింది. ఈ సినిమా కూడా రీసెంట్ గా ఓటీటీలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. చాలాకాలం తర్వాత శృతి హాసన్ కి బాలీవుడ్ లో కూడా హిట్ అందుకోవడం విశేషం. అయితే అసలు సక్సస్ శృతి హాసన్ కి రవితేజ క్రాక్, బాలీవుడ్ సినిమా కంటే కూడా తమిళ సినిమా లాభం మీదే ఆశలు ఎక్కువగా పెట్టుకుందట.
అంతేకాదు ఇప్పుడు శృతి హాసన్ పూర్తి స్థాయిలో సక్సస్ సాధించాలంటే అది విజయ్ సేతుపతి చేతిలోనే ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ – విజయ్ సేతుపతి కాంబినేషన్ లో లాభం అన్న సినిమా వస్తోంది. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ కోలీవుడ్ లో కూడా శృతి హాసన్ ఫాంలోకి వస్తుంది. అందుకే విజయ్ సేతుపతి లాభం సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకుందని అంటున్నారు. కాగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం గా కోలీవుడ్ ఫ్యాన్స్ ఉన్నారట. ఆ మధ్య ఫేడవుట్ అయిపోయిందనుకున్న త్రిష కి విజయ్ సేతుపతి 96 సినిమాతో సక్సస్ వచ్చేలా చేశాడు.