కృతి శెట్టి ఫ్లాప్ లకి ఆమె కారణమట?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి అందాల భామ కన్నడ కస్తూరి కృతి శెట్టి. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఈ రెండు సినిమాలు కూడా హిట్ కావడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది అని అందరూ భావించారు. దానికి తగ్గట్లుగానే రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన బైలింగ్వల్ మూవీ ది వారియర్ లో అవకాశం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. నితిన్ కి జోడిగా మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి నటించింది.

ఈ మూవీ కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలో ఏకంగా డ్యూయల్ రోల్ లో కనిపించింది. ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో కృతి శెట్టి కెరియర్ ఒక్కసారిగా ఫాల్ డౌన్ అయింది. ప్రస్తుతం తెలుగులో ఆమె నాగచైతన్యకి జోడిగా కస్టడీ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ద్విభాషా చిత్రంగా మే నెలలో రిలీజ్ కాబోతోంది.

దీంతోపాటు తమిళ్, మలయాళీ భాషలలో రెండు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతానికి కృతి శెట్టి చేతిలో ఈ మూడు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఉప్పెన సినిమా తర్వాత కొటి వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు 50 లక్షల లోపుకి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కృతి శెట్టి కెరియర్ ఇలా ఫాల్ డౌన్ కావడానికి కారణం ఆమె తల్లి నీతి శెట్టి కారణం అనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. కృతి శెట్టికి దర్శకుడు కథ చెప్పడానికి వెళ్తే ఆమె తల్లి నీతి కూడా వింటుందంట.

ఆమెకు నచ్చకపోతే సినిమాని చేయొద్దని చెప్పేస్తుందట. అలాగే పాత్రలలో మార్పులు చేయాలంటూ నీతి శెట్టి డిమాండ్ చేస్తున్నారంట. ఈ నేపథ్యంలో కృతి శెట్టి చాలా సినిమాలను వదులుకున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. అలా ఆమె వదులుకున్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయని సమాచారం. ఇక క్యారెక్టర్ బాగుందని నీతి శెట్టి రికమండేషన్ తో చేసిన ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాల్సిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే టాప్ చైర్ లోకి రావాల్సిన కృతి శెట్టి కెరియర్ వెనక్కి పడిపోయినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.