‘అక్కినేని’ కోసం సమంత రావల్సిందేనేమో.!

వరుస ఫెయిల్యూర్స్‌తో అక్కినేని కుటుంబం సతమతమవుతోంది. ఒక్కరంటే ఒక్కరు కూడా హిట్టు కొట్టలేకపోతున్నారు అక్కినేని ఫ్యామిలీలో. అటు వైపు సమంత కూడా వరుస ఫెయిల్యూర్స్ చవి చూస్తోంది. ఇదిలా వుంటే, సమంత, నాగ చైతన్య కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ కోసం ఎప్పటి నుంచో తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయ్.

ఈ కాంబోని సెట్ చేయడానికి చాన్నాళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయ్. అవి ఇప్పుడు మరింత జోరందుకున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే, అతి త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. బహుశా వచ్చే నెల్లోనే అది వర్కవుట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఓ ప్రముఖ నిర్మాత ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు ట్రై చేస్తున్నాడట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.