Samantha – Naga Chaitanya: సమంత నాగచైతన్య మళ్లీ ఒక్కటవబోతున్నారా.. ఇందులో నిజమెంత..?

Samantha – Naga Chaitanya: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నాము అని ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే సమంత, నాగచైతన్య విడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే విడిపోతున్నట్లు ప్రకటించిన దాదాపుగా కొన్ని నెలలు కావస్తున్నా ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా విడిపోవడానికి గల కారణం ఏమిటి అన్నది ఇంతవరకూ తెలియనే లేదు.

ఈ విషయంపై ఇటు సమంతా కానీ, అటు నాగచైతన్య కానీ స్పందించలేదు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటాము అని ప్రకటించారు. కానీ తీసుకున్న తర్వాత ఎవరికీ ఎవరు సంబంధం లేదు అన్నట్టుగా ఎవరికి వారు వారి కెరీర్ పరంగా బిజీబిజీగా ఉన్నారు. నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత నాలుగు నెలల గ్యాప్ లోనే రెండు బ్లాక్ బస్టర్హిట్స్ ను అందుకున్నాడు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాలో పాటు వెంకట్ ప్రభు, నందినీరెడ్డి సినిమాలను చేయబోతున్నాడు. ఇది ఈ సినిమాలో మొదట సమంత హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత సమంత నాగ చైతన్యలు తీసుకొని విడిపోయారు.

దీనితో ఆ ప్రాజెక్టు కాస్త పెండింగ్ పడింది. అయితే నందిని రెడ్డి సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ ఆ ప్రాజెక్టుని వారిద్దరితో కలిసి చేయాలి అన్న పట్టుదలతో ఉందట. అందుకోసం నాగచైతన్య సమంత లను ఒష్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చైతన్య నుంచి సానుకూల స్పందన ఉందని, ఇక సమంత ఒప్పించే పనిలో నందినిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియదుగానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే అభిమానులకు ఇది పెద్ద పండగే అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇది ఒక సెన్సేషన్ ప్రాజెక్టు కాబోతోంది అని సమాచారం.