అందుకు సమంత నో చెప్పిందా.?

బిగ్‌బాస్ టీమ్ సమంతని సంప్రదించిందట. బిగ్‌బాస్ సీజన్ 7 ఫస్ట్ డేకి విజయ్‌తో పాటూ సమంత కూడా రావాల్సి వుందట. అటు ‘ఖుషి’ సినిమా ప్రమోషన్ అయినట్లూ వుండేది. ఇటు బిగ్‌బాస్ షోకి హైప్ వచ్చినట్లూ వుండేదని చాలా ట్రై చేశారట.

అయితే, సమంత అందుకు అంగీకరించలేదట. కానీ, అప్పుడు నో చెప్పినందుకు సమంత ఇప్పుడు బాధపడుతోందట. ఎందుకంటే, ఆ షోలో నాగార్జున, ఏదీ మీ హీరోయిన్ ఎక్కడా.. సమంత రాలేదా.? అని విజయ్‌ని అడిగారు.

అదే ఇప్పుడు సమంతని బాధపడేలా చేస్తోంది. అక్కినేని కుటుంబానికి సమంత పట్ల ఎలాంటి బేధాభిప్రాయం లేదు.. అన్నట్లుగా అక్కడ ఆ సిట్యువేషన్ కన్‌వే అయ్యింది. పాపం సమంత బ్యాడ్ లక్.. నాగార్జునకీ, అక్కినేని ఫ్యామిలీకి అలా కలిసొచ్చేసిందంతే.

ఈ విషయంపై విజయ్ దేవరకొండ కూడా సమంతకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడట. ఎలాగైనా షోకి తీసుకురావాలనుకున్నాడట. అయితే, ఎందుకొచ్చిన కాంట్రవర్సీలే.. అని సమంత వెనక్కి తగ్గిపోయిందట.

కానీ, ఏదో ఒక వీకెండ్‌లో సమంత బిగ్‌బాస్ స్టేజ్ మీద కనిపించే అవకాశాలున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. గతంలో బిగ్‌బాస్ సీజన్ ఓ ఎపిసోడ్‌కి స్పెషల్‌గా సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ సీజన్ కంటెస్టెంట్ అయిన దివిని హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చింది సమంత. అదే స్టేజ్‌పై ఓ దర్శకుడికి దివిని, సమంత రిఫర్ చేసింది కూడా. ఆ తర్వాత ఆ డైరెక్టర్ దివికి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగింది సమంతపై వున్న అభిమానంతో.