‘లియో’ సినిమాలో రామ్‌ చరణ్‌ ఉన్నాడా..!

లియో సినిమాలో రామ్‌ చరణ్‌ ఉన్నాడు అంటూ రెండు మూడు రోజులుగా సోషల్‌ విూడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే దీని విూద మాత్రం లియో యూనిట్‌ రియాక్ట్‌ అవడం లేదు. సినిమా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది అడిషనల్‌ ప్రమోషన్‌ కింద వాళ్ళు లెక్క కడుతున్నారు. సినిమాలో రామ్‌ చరణ్‌ ఉన్నాడా లేదా అనే విషయంపై వాళ్లు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

లోకేష్‌ కనకరాజ్‌ కూడా దీని విూద సైలెన్స్‌ మైంటైన్‌ చేస్తున్నాడు. సినిమాకు ఎలాగూ ప్రమోషన్‌ వస్తుంది కాబట్టి.. అనవసరంగా మాట్లాడి దాని గురించి ఓపెన్‌ అవ్వడం ఎందుకు అనేది యూనిట్‌ ఆలోచన. వచ్చే అడిషనల్‌ పబ్లిసిటీ రాని అంటూ వాళ్ళు కూడా ఊరుకున్నారు. ముందు దీని గురించి చరణ్‌ ఫాన్స్‌ పెద్దగా పట్టించుకోకపోయినా కూడా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న కొద్ది నిజంగానే లియో సినిమాలో మెగా వారసుడు ఉన్నాడేమో అని ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి.

దానికి తోడు సోషల్‌ విూడియాలో కోబ్రా అనే క్యారెక్టర్‌ లో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు అంటూ పోస్టర్స్‌ దర్శనమిస్తున్నాయి. ఈ విషయంలో పక్క ఇన్ఫర్మేషన్‌ ఏంటంటే.. సినిమాలో రామ్‌ చరణ్‌ లేడు.. కేవలం ప్రమోషన్‌ కోసం మాత్రమే కొంతమంది ఇలా ఫేక్‌ న్యూస్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు అనేది పక్కా వార్త. వచ్చే ఫ్రీ పబ్లిసిటీ ఎందుకు వదులుకోవాలి అంటూ లియో యూనిట్‌ కూడా ఏవిూ మాట్లాడడం లేదు. అక్టోబర్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే తమిళనాడులో స్టాలిన్‌ గవర్నమెంట్‌ ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ కు పర్మిషన్‌ ఇవ్వలేదు. వచ్చే క్రౌడ్‌ కంట్రోల్‌ చేయలేము.. అందుకే ఫంక్షన్‌ పెట్టడం లేదు అంటూ దర్శక నిర్మాతలు ఏదో క్లారిటీ అయితే ఇచ్చారు.. కానీ అందులో రాజకీయ కోణాలు ఎక్కువగా వెతుకుతున్నారు అభిమానులు.

అందుకే హైదరాబాదులో లియో ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే వెన్యూ ఎక్కడ అనేది మాత్రం ఇప్పటివరకు డిసైడ్‌ చేయలేదు. ఒకవైపు బాలకృష్ణ భగవంత్‌ కేసరి.. మరోవైపు రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు కూడా ఉండడంతో వాటి ఫంక్షన్స్‌ అయిపోయిన తర్వాతే లియో వేడుక ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది.

ఏదేమైనా కూడా ఈ సినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రామ్‌ చరణ్‌ నిజంగానే సినిమాలో ఉంటే మాత్రం కలెక్షన్స్‌ అదిరిపోతాయి.. లేకపోయినా కూడా విజయ్‌, లోకేష్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ తో కలెక్షన్స్‌ మాత్రం కుమ్మేస్తాయి అనేది ట్రేడ్‌ అంచనా. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్‌ ఏకంగా 22 కోట్లకు కొన్నారు. దసరా సెలవులు భారీగానే ఉండడంతో పాజిటివ్‌ టాక్‌ వస్తే ఈ సినిమాకు 22 కోట్లు పెద్ద లక్ష్యం కాకపోవచ్చు. మొత్తానికి చూడాలి విజయ్‌ ఈ సినిమాతో ఏం చేస్తాడో..!