బాలీవుడ్ లో ఆ స్టార్ హీరోయిన్ కి చెక్ పెట్టబోతున్న పూజా హెగ్డే..?

Pooja Hegde

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ సంపాదించున్న పూజా హెగ్డే ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. వరసగా ‘అరవింద సమేత’, మహర్షి, ‘అల వైకుంఠపురంలో’.. సినిమాలలో నటిచి బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా ‘రాధే శ్యామ్’, అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తోంది. అంతేకాదు పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. స్టార్ హీరోలకి బెస్ట్ ఛాయిస్.. లక్కీ హీరోయిన్. అందుకే రెమ్యూనరేషన్ ఎంత అయినా ఓకే అంటున్నారు మేకర్స్.

Pooja Hegde's popular Instagram pictures that grabbed massive attention -  Republic World

ఇలా టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ స్టార్ డమ్ కోసం బాగానే ప్లాన్స్ వేసుకుంది. గతంలో హిందీలో ఒక సినిమా చేసి ఫ్లాప్ అందుకున్న పూజా హెగ్డే ఈసారి మాత్రం స్టార్ గా ఒక వెలుగు వెలగాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండీ’ సినిమాలో పూజా నటిస్తోంది. ఈ సినిమాతో పక్కా బ్లాక్ బస్టర్ అందుకుంటానన్న ధీమాతో ఉంది పూజా. అందుకు కారణం గత మూడు నాలుగేళ్ళగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ఫ్లాప్ అన్నది ఎరగడు. ఇదే పూజా నమ్మకం.

Bachchan Pandey: Film's Plot REVEALED & Pooja Hegde To Be A Part Of The Akshay  Kumar, Kriti Sanon Starrer?

ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అంతేకాదు కండల వీరుడు సన్ల్మాన్ ఖాన్ కి జంటగా కూడా పూజా హెగ్డే ఒక సినిమా చేస్తుంది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పూజా కి ఈ రెండు సినిమాలు అద్భుతమైన అవకాశాలు. అందుకే ఎలాగైనా ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ పొందాలని చూస్తుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ఉన్న కియారా అద్వానికి చెక్ పెట్టొచ్చు అన్న టాక్ కూడా మొదలైంది.