‘బ్రో’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ జోరందుకున్నాయి. కేతిక శర్మ మీడియా ముందుకొచ్చింది. సాయి ధరమ్ తేజ్ కూడా మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా వున్నాడు.
ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఎక్కడ.? రాజకీయ కార్యకలాపాలతో బిజీగా వున్న పవన్ కళ్యాణ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కనిపిస్తాడన్నది తాజా ఖబర్. అయితే, ఈ విషయమై స్పష్టత రావాల్సి వుంది. డబ్బింగ్‌కి సంబంధించి కొంత పెండింగ్ వుందని అంటున్నారు.
ఇదిలా వుంటే, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అనూహ్యమైన రీతిలో జరిగింది. నైజాం 30 కోట్ల పైనే.! మొత్తంగా 150 కోట్లపైనే జరిగిందని అంటున్నారు. మరోపక్క, పవన్ కళ్యాణ్ అటూ ఇటూగా 70 నుంచి 80 కోట్ల వరకు తీసుకున్నాడన్నది సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రిస్క్ అంతా పవన్ తీసుకుంటున్నాడట. ఏ సమస్య వచ్చినా తానే అండగా వుంటానని నిర్మాతలకు భరోసా ఇచ్చాడట. డిస్ట్రిబ్యూటర్లకీ పవన్ తరఫున భరోసా వెళ్ళిందని సమాచారం.
అసలు ఆ పరిస్థితే రాదన్నది ‘ఫస్ట్ కాపీ’ చూసినవాళ్ళ అభిప్రాయమ్.!