పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో రిస్క్ చేస్తున్నాడట.!

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో ‘ఓజీ’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అనీ, ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనీ.. సినిమా గురించి పేర్కొంటున్నారు. అలా ఈ సినిమాకి ‘ఓజీ’ అనే టైటిల్ కన్ఫామ్ అయ్యేలా వుంది కూడా. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని దానర్థమట.

సరే, ఆ సంగతి పక్కన పెడితే.. ‘ఓజీ’ పేరుతో పార్ట్ వన్, పార్ట్ టూ.. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేలా వున్నాయన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

పవన్ – సుజీత్ మధ్య ఈ ప్రాజెక్టు గురించి ప్రాథమిక చర్చలు జరిగినప్పుడే, ఒకటీ.. రెండూ.. మూడూ.. అనే ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా వుంటే, ప్రస్తుతానికైతే ‘ఒకే పార్ట్’ అని సుజీత్ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. నిడివి సాధారణం కంటే కాస్త తక్కువగా వుంటుందట. షూటింగ్ డేస్ కూడా తక్కువే వుంటాయని అంటున్నారు.

హీరోయిన్ వుంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వుంటాయి. సింపుల్‌గా, చాలా రిచ్‌గా, టెక్నికల్లీ సౌండెడ్‌గా యాక్షన్ ఎపిసోడ్స్‌ని డిజైన్ చేస్తారట. ఇంతకీ, నిడివి తక్కువైతే.. రిస్కేమో.?