ఇటీవలే మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ అయి చక చకా కొన్ని రోజులు టాకీ పార్ట్ కంప్లీట్ చేశాడు. మరికొద్ది రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉందనగా మళ్ళీ బ్రేక్ పడింది. ఇప్పటికే వకీల్ సాబ్ మొదలై 10 నెలలు దాటింది. కరోనా కారణంగా ఏ సినిమా షూటింగ్ జరగకుండా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చి వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయగానే అందరూ సంబరాలు చేసుకున్నారు. కాని తాజా పరిణామాలు చూస్తుంటే పవన్ తో సినిమా తీయాలని కమిటయిన దర్శకులకి ఆయన సినిమా కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునేందుకు సరైన క్లారిటీ రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
అందుకు కారణం ఆయన జనసేన పార్టీ నాయకుడు కావడమే. ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో రెండు పడవల మీద ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాడు. కాని ఇప్పుడది దర్శక, నిర్మాతలకి కాస్త ఇబ్బంది కలిగిస్తుందని ప్రచారం అవుతోంది. శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. టాకీపార్ట్ కంప్లీట్ అయితే దిల్ రాజు రిలీజ్ కి సన్నాహాలు చేసుకుంటాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక పీరియాడికల్ సినిమా చేయాల్సి ఉంది.
అయితే ఈ సినిమా మొదలయ్యాక కేవలం 15 రోజుల షెడ్యూల్ మాత్రమే కంప్లీట్ అయింది. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా మళ్ళీ మొదలవలేదు. క్రిష్ రెడీగా ఉన్నా పవన్ అనూహ్యంగా మరో సినిమా కమిటవడం వల్ల క్రిష్ అనుకున్న ప్లాన్ మారిందని అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత పక్కా ప్లాన్ తో క్రిష్ ఒక సినిమాని కూడా కంప్లీట్ చేశాడు. కాని పవన్ సినిమా విషయం లో డైలమా ఉందట.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి తక్కువ డేట్స్ ఇచ్చి సినిమా ఫినిష్ చేయాలనుకున్నాడు. కాని ఈ సినిమా కూడా ఇప్పుడు మొదలవదని అంటున్నారు. ఆ తర్వాత లైన్ లో ఉన్న హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డి కూడా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకోవాలంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అని చెప్పుకుంటున్నారట. ఇక బండ్ల గణేష్ నిర్మాణం లో తెరకెక్కాల్సిన సినిమా అయితే ఇప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు అని కామెంట్ చేస్తున్నారట.