నందమూరి వంశంలో పుట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పోలికలో, నటనలో తాతకి తగ్గ మనవడుగా..దూకుడులో తండ్రికి తగ్గ తనయుడుగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తారక్ అని దర్శక ధీరుడు చాలా ఆప్యాయంగా పిలుచుకుంటాడు. స్నేహానికి నిలువెత్తు రూపం .. ఎంతో మృదు స్వభావి ..దాదాపు 13 ఏళ్ళు కూచిపూడి లో ప్రావీణ్యం పొంది నాట్యానికి కొత్త అర్థం చెప్పాడు ఎన్టీఆర్. మెగా హీరోలతో పాటు డాన్స్ లో ఎన్టీఆర్ వేరే లెవల్ అని చెప్పాలి. డాన్స్ అయినా .. పర్ఫార్మెన్స్ అయినా ప్రాణం పెట్టేస్తాడు. ఈ ఎన్టీఆర్ మీద అలనాటి సీనియర్ నటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాలో అక్కినేని సమంత హీరోయిన్ గా నటించింది.
ప్రకృతిని కాపాడుకోవాలి అన్న కాన్సెప్ట్ తో అద్భుతంగా తెరకెక్కించాడు కొరటాల. మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా సీనియర్ నటి అర్చన కి విపరీతంగా నచ్చిందని ఇందులో తారక్ పర్ఫార్మెన్స్ అధ్బుతమని తన అభిప్రాయాన్ని బయట పెట్టారు. అర్చన ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలలో “మహానటి”, “జనతా గ్యారేజ్” వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అంతేకాదు మోహన్ లాల్ లాంటి ఒక లెజెండరీ యాక్టర్ తో నటించినప్పటికి ఆ సీనియర్ నటుడి కి స్పేస్ ఇచ్చి తన స్పేస్ తాను తీసుకొని మ్యాచ్ చేస్తూ నటించడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక్క ఎన్టీఆర్ వల్లే అయిందని వెల్లడించారు. ఈ రకంగా ఎన్టీఆర్ కి ఈ జనరేషన్ లో వాళ్ళే కాదు ఆ జనరేషన్ లో వాళ్ళు కూడా అభిమానులు ఉన్నారని.. వాళ్ళు ఎన్టీఆర్ సినిమాలని తప్పకుండా చూస్తున్నారని అర్థమవుతోంది.