Naga Chaithanya : నాగచైతన్య సమంత ఏం మాయ చేసావే సినిమాతో మొదటిసారి కలసి నటించారు. వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దల సమక్షం లో వివాహ బంధం తో ఒక్కటయ్యారు.కానీ పెళ్లైన 4 సంవత్సరాలకే విడుకులతో వివాహ బంధానికి స్వస్తి పలికారు.అయితే విడాకుల అనంతరం ఇద్దరు వారి వారి కెరీర్ లో రానిస్తున్నారు.
సమంత విడాకుల తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా కొలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా చాలా బిజీ గా వున్నారు. ఇక పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైతన్య కూడా వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.తన తండ్రి తో కలసి నటించిన బంగార్రాజు సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నారు. అంతే ప్రస్తుతం ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి చేసిన లాల్ సింగ్ ఛధా అనే సినిమా కూడా ఆగష్టు 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున నాగ చైతన్యకి రెండో పెళ్లి చెయ్యడానికి సిద్ధం అయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది.ప్రస్తుతం అఖిల్‌కి పెళ్లి చెయ్యడం కోసం గత కొంత కాలం నుండి నాగార్జున సంబంధాలు చూస్తున్నారట.అఖిల్‌తో పాటుగా నాగ చైతన్యకి కూడా ఒక్కేసారి పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు నాగ చైతన్య కూడా అంగీకరించినట్టు సమాచారం.కొన్నిరోజులుగా నాగచైతన్య టాలీవుడ్ హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయ్.మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.