అందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్ – హరీష్ శంకర్ ల కాంబో ఫిక్స్ ..?

ఇండస్ట్రీలో ప్రతీ డైరెక్టర్ లైఫ్ లో ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలనుకునే స్టార్ .. మెగాస్టార్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం కొన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో కొన్ని క్రేజీ కాంబినేషన్ కూడా ఉన్నాయి. రాజమౌళి – మెగాస్టార్ కాంబినేషన్ అంటే ఇక ఆ సినిమా స్థాయిని ఊహించుకోవడమే కష్టం. పాన్ ఇండియన్ రేంజ్ సినిమానే. అలాగే త్రివిక్రం – మెగాస్టార్ కాంబో.. పూరి జగన్నాధ్ – మెగాస్టార్ కాంబో. ఈ కాంబోలో సినిమా వస్తే ఫ్యాన్స్ లో ఎనర్జీ టన్నుల్లోనే ఉంటుంది. బ్లైండ్ గా బ్లాక్ బస్టర్ ఫిక్సవ్వాల్సిందే.

ఇలాంటి రేర్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి – హరీష్ శంకర్ లది. ఈ కాంబినేషన్ లో సినిమా గనక వస్తే మెగా ఫ్యాన్స్ తో పాటు దేశంలో ఉన్న తెలుగు ప్రేక్షకుల అంచనాలు తార స్థాయిలోనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఫిక్సవబోతుందని సమాచారం. ఇప్పటికే హరీష్ శంకర్ కి మెగా ఫ్యామిలీ అంటే విపరీతమైన అభిమానం. హరీష్ శంకర్ కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే.

ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఇక అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం తీశాడు. వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ తీశాడు. ఇలా మెగా హీరోలకి మంచి హిట్స్ ఇచ్చాడు. కాగా తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయంటున్నారు.