విజయ్ దేవరకొండ తో కియారా అద్వానీ ..?

టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్.. సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అయినా టాలీవుడ్ లో సాలీడ్ ఆఫర్స్ తో విజయ్ మంచి ఫాం లో ఉన్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ముంబై లో కొంత టాకీ పార్ట్ పూర్తయ్యాక కరోనా కారణంగా ఆగిపోయింది. కాగా ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతుందన్న వార్తలు వస్తున్నాయి.

Ananya Panday to star opposite Vijay Devarakonda in Puri Jagannadh's next-  The New Indian Express

పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు. ఇక పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అఫీషియల్ గా సుకుమార్ సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

Vijay Devarakonda and Kiara Advani Visuals @ Filmalaya Studio | Manastars -  YouTube

అయితే తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే మన యంగ్ హీరో విజయ్ కి జంటగా కియారా అద్వాని నటించబోతుంది అని. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలలో నటించిన కియారా ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. కాగా ఇటీవలే మళ్ళీ టాలీవుడ్ కి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కియారా.. విజయ్ తో జోడీ కట్టబోతుందని సమాచారం. కాగా ఇంతకముందు విజయ్ దేవరకొండ – కియారా అద్వానీ కలిసి ఒక యాడ్ ఫిల్మ్ లో కనిపించిన సంగతి తెలిసిందే.