ఇపటికే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటి పోయింది. త్రివిక్రం దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా 2018 లో రిలీజైంది. ఆ తర్వాత నుంచి కంప్లీట్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ కే పరిమితమైయ్యాడు. ఈ సినిమాలో తారక్ పోరాట యోధుడు కొమరం భీం గా నటిస్తున్నాడు. మరో టాలీవుడ్ స్టార్ హీరో రాం చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొనగా తాజాగా భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని వెంటనే తాజా షెడ్యూల్ ని ప్రారంభించాడు రాజమౌళి. కాగా ఈ సినిమా తర్వాత తారక్ మరోసారి త్రివిక్రం దర్శకత్వంలో నటించబోతున్నాడు. తారక్ కెరీర్ లో ఈ సినిమా 30 వ సినిమాగా రూపొందనుండటంతో పాన్ ఇండియన్ స్క్రిప్ట్ ని సిద్దం చేశాడట త్రివిక్రం. ఇక ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియోషన్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రాం – రాధాకృష్ణ సమ్యుక్తంగా నిర్మించబోతున్నారు.
అయితే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి హీరోయిన్స్ విషయంలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే అరవింద సమేత లో ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్డే నటించింది కాబట్టి ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే ని త్రివిక్రం తీసుకునే ఆలోచనలో ఉన్నాడన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినిపించింది. కాగా తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి ప్లేస్ ఉందని ఆ ఇద్దరిలో ఒకరు కియారా అద్వానీ.. ఒకరు రష్మిక మందన్న లని ఎంచుకునే ఉద్దేశం లో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. అందుకు కారణం ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం తో పాటు ఇద్దరు ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తుండటమే. మరి ఇది అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.