పూజా హెగ్డే కి రివర్స్ లో ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. టాలీవుడ్ హీరోలే టార్గెట్ ..?

బాలీవుడ్ డెబ్యూ సినిమా మెహంజాదారో ఘోరంగా ఫ్లాపవడంతో పూజా హెగ్డే కి ఇక చాలాకాలం హిందీ సినిమాలలో అవకాశాలు రాలేదు. ముంబై నుంచి వచ్చి తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలుగుతుంది. కాని బాలీవుడ్ లో ఇప్పటికి వరకు ఒక సాలీడ్ హిట్ దక్కించుకోలేకపోయింది. గత ఏడాది సక్సస్ ఫుల్ సిరీస్ హౌజ్ ఫుల్ – 4 లో నటించినప్పటికి భారీ మల్టీస్టారర్ కాబట్టి సోలో హిట్ గా పూజా దక్కినట్టు ఎవరు భావించడం లేదు. అందుకే ఇప్పుడు మూడు భారీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ అందుకొని సోలో హీరోయిన్ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది.

Mohenjo Daro - Latest News on Mohenjo Daro | Read Breaking News on Zee News

అందుకు కారణం పూజా హెగ్డే కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అండ్ డిమాండ్ అని చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో పూజా హెగ్డే యంగ్ హీరోల సినిమాలు చేసినప్పటికి దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అన్ని పెద్ద బ్యానర్స్ .. పెద్ద స్టార్ హీరోల సినిమాలే చేస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి, ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమాలతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

Happy birthday Prabhas: 'RadheShyam's new motion poster out, actor romances Pooja  Hegde on train

ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా చేస్తుంది. ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. అలాగే అఖిల్ అక్కినేని కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్న సినిమా చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో పూజా హెగ్డే రెమ్యూనరేషన్ 2 కోట్లకి పైగానే అంటున్నారు. ఇదే సమయంలో వరసగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లతో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంది. కాగా ఇక్కడ క్రేజ్ సంపాదించుకొని బాలీవుడ్ కి పూజా వెళుతుంటే అక్కడ క్రేజీ హీరోయిన్ గా పాపులర్ అయిన జాక్విలిన్ ఫెర్నాండస్ టాలీవుడ్ వైపు చూస్తోంది.

ఇప్పటికే ప్రభాస్ నటించిన సాహో సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమాలో నటిస్తుంది. నిజంగా జాక్విలిన్ కి ఈ సినిమా ఊహించని అవకాశం. కాగా ఈ సినిమాతో పాటు మరిన్ని తెలుగు సినిమాలు దక్కించుకునేందుకు టాలీవుడ్ మేకర్స్ ని హీరోలని ఆకట్టుకుంటోందట. మొత్తంగా పూజా హెగ్డే మాదిరిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అవడానికి విపరీతంగా ట్రై చేస్తుందని చెప్పుకుంటున్నారు.