గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఈ మధ్యనే లక్నోలో పెట్టిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్,4999 నామన్, ఫారెస్ట్ గార్ల్యాండ్, టిఎక్స్ 75040 లొకేషన్ లో సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభం కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటున్న తొలి సినిమాగా గేమ్ చేంజర్ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. అయితే అదే సమయంలో గ్రాండ్ సక్సెస్ అయిన పుష్ప టు మూవీ కూడా అమెరికాలో మూవీ సక్సెస్ ఈవెంట్ ని సెలబ్రేట్ చేయబోతుంది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాతలు కూడా ఈ ఈవెంట్ లో పాల్గోబోతున్నట్లు సమాచారం. అయితే గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా సుకుమార్ వెళ్లబోతున్నట్లు సమాచారం.
సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ మూవీ రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే అంతే కాదు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ సుకుమార్ తో ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే గేమ్ చేంజర్ ఈవెంట్ కి అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా వెళ్ళబోతున్నారని సమాచారం. విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ ఆనంద పడుతున్నారు అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది తెలియాల్సి ఉంది.