హరీష్ శంకర్ దెబ్బకి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారట ..?

ఒక హీరోని మాస్ గా చూపించాలన్నా.. బాక్సాఫీస్ లెక్కలు కొత్తగా రాయాలన్నా హరీష్ శంకర్ తరవాతే ఎవరైనా. ఈ పేరే సంపాదించుకున్నాడు గబ్బర్ సింగ్ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్. బాలీవుడ్ సినిమాని గబ్బర్ సింగ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. మిరపకాయ్ తో మాస్ మహారాజ రవితేజ తో పాటు ఎన్.టి.ఆర్. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లాంటి హీరోలకి మంచి మాస్ హిట్స్ ఇచ్చాడు.

PSPK 28: Pawan Kalyan's 28th film concept poster out on his birthday |  Telugu Movie News - Times of India

ప్రస్తుతం మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో 28 వ సినిమా కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిటయిన సినిమాలన్నిటి కంటే ఎక్కువ క్రేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్ళీ ఎన్నో సార్లు హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో 2021 సినిమా రిలీజ్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాడని అంటున్నారు. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ అసలు ఊహించనిది. అందుకే సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో గాని ఇలా డ్యూయల్ రోల్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడంటే మాత్రం సినిమా రేంజ్ ని ఎవరూ ఊహించలేరు.