Home News నభా సాయి పల్లవి ల మధ్య పోరు మొదలైందా ..?

నభా సాయి పల్లవి ల మధ్య పోరు మొదలైందా ..?

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత టాలీవుడ్ లో వరసగా అవకాశాలు అందుకుంటోంది నభా నటేష్. అదుగో, నన్ను దోచుకుందువటే సినిమాలతో రాని క్రేజ్ అమాంతం ఇస్మార్ట్ శంకర్ తో వచ్చేసి అందరి చూపు నభా మీద పడింది. దాంతో రవితేజ తో డిస్కోరాజా సినిమా చేసింది. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. కాగా యంగ్ హీరో నితిన్ తో అంధాదున్ రీ మేక్ లో నభా నటిస్తోంది. ఈ సినిమాలో గ్లామరస్ క్యారెక్టర్ చేయబోతుందని అంటున్నారు.

Nabha Natesh Roped In For 'Ismart Shankar' | Regional News | Zee News

ఇక టాలెంటెడ్ హీరోయిన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చేతిలో కూడా వరసగా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే నాగ చైతన్య తో లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ చేసింది. శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కించాడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అలాగే రానా దగ్గుబాటి నటిస్తున్న విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాయి పల్లవి లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Sai Pallavi To Choreograph A Song For Her Love Story - Tollywood

ఇక నేచురల్ స్టార్ నాని నటించబోతున్న శ్యామ్ సింగ్ రాయ్ లో కూడా సాయి పల్లవి ఒక హీరోయిన్ గా నటించబోతుంది. ఈ సినిమాకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఇలా అటు నభా నటేష్.. ఇటు సాయి పల్లవి వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి జనాలు బాగా అలవాటు పడ్డారు. నెమ్మదిగా ఏ హీరో సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. దాంతో మేకర్స్ డిఫ్రెంట్ కాంబినేషన్ లో వెబ్ సిరీస్ ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు – తమిళంలో ఒక వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందులో సాయి పల్లవి, బ్యూటీ నభా నటేష్ కలిసి నటించబోతున్నారట. రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం.

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News