ఆచార్య.. మెగా అభిమానులు.. యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ సినిమా. సైరా తర్వాత వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని కరోనా కారణంగా అన్ని సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా ఆగిపోయింది. వాస్తవంగా ఆచార్య షూటింగ్ మొదలయ్యాక అద్భుతంగా చిత్రీకరణ జరిగి చక చకా 40 శాతం చిత్రీకరణ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ కూడా కంప్లీటయింది.
కాని ఆ తర్వాత లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. మళ్ళీ గత నెల నుంచి రాధే శ్యాం లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమా నుంచి అల్లరి నరేష్ నటిస్తున్న నాంది లాంటి సినిమాల వరకు చాలా సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక భారీ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ అయితే చెప్పినట్టుగానే గత నెల 5 నుంచి సెట్స్ మీదకి వచ్చి అన్నట్టుగానే గత నెల 22 న ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ టిజర్ ని కూడా రిలీజ్ చేశారు.
కాని ఆచార్య మాత్రం మొదలవలేదు. దాంతో ఇక కొంతమంది సోషల్ మీడియాలో ఆచార్య ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు లేవని.. మెగాస్టార్ ఏజ్ 60 ఏళ్ళు దాటింది కాబట్టి షూటింగ్ మొదలు పెట్టేందుకు ఆలోచిస్తున్నారని .. 2021 లోనే చిరు సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని.. ఇలా రక రకాల వార్తలు వచ్చాయి. అంతేకాదు జనవరి లో మొదలయ్యే ఆచార్య ముందు చెప్పినట్టుగా సమ్మర్ కి రిలీజ్ అవడం కూడా కష్టమని రాసుకొచ్చారు. కాని ఇందుకు తెర దించి అదిరిపోయే క్లారిటి ఇచ్చారు మేకర్స్. నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్ మొదలవబోతుందని ఎట్టి పరిస్థితుల్లో 2021 సమ్మర్ కి రిలీజ్ ఉంటుందని తేల్చిపారేసి రూమర్స్ కి చెక్ పెట్టారు.