బిగ్ బాస్ హోస్ట్ గా ఇక నాగార్జున వద్దు సమంత కావాలి అంటున్నారా ..?

 సమంత మల్టీ టాలెంటెడ్ అని అందరికీ తెలిసిందే. సినిమాలతో పాటు రీసెంట్ గా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. సినిమాల మాదిరిగానే సమంత మొదలు పెట్టిన బిజినెస్ కూడా సక్సస్ అయిందని అంటున్నారు. వరసగా భారీ ప్రాజెక్ట్స్ లో నటించి నంబర్ వన్ ప్లేస్ కి చేరుకున్న సమంత ఆ మధ్య చైతూ తో కలిసి సొంతగా నిర్మాణ సంస్థ ని ప్రారంభించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ నిర్మాణ సంస్థలలో సినిమాలు .. వెబ్ సిరీస్ నిర్మించాలని కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని అనుకున్నారట.

We Were In A Live-In Relationship: Samantha Akkineni Talks About Life With Naga  Chaitanya! | JFW Just for women

అయితే ఇంకా సొంత నిర్మాణ సంస్థ లో సినిమాలు నిర్మాణం గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కాని రీసెంట్ గా సమంత హోస్ట్ గా మారింది. అది కూడా ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి. సమంత మావయ్య అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 సక్సస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 4 host Akkineni Nagarjuna looks stunning in this new post;  see pic

అయితే నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ నిమిత్తం దాదాపు 20 రోజులుకి పైగానే బిగ్ బాస్ నిర్వాహకులకి అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతని సమంత తీసుకుంది. అయితే బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కి బదులు సమంత అనగానే ప్రతీ ఒక్కరు సందేహాలు వ్యక్తం చేశారు. అందుకు కారణం సమంత కి ఇప్పటి వరకు హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం లేకపోవడమే.

కాని రీసెంట్ గా టెలికాస్ట్ అయిన వీకెండ్ ఎపిసోడ్ లో సమంత మావయ్య నాగార్జున ని మరిపించేసిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు నాగార్జున లేకపోయినా ఇకపై షో నడిపించడానికి సమంత ఉంటే సూపర్ హిట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి అందరి అంచనాలని తారుమారు చేసి బిగ్ బాస్ హోస్ట్ గా సమంత అదరగొట్టిందని ప్రశంసలు దక్కుతున్నాయి.