డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు సోనూసూద్. ఆ తర్వాత వరసగా అరుంధతి, దూకుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. చెప్పాలంటే సోనూసూద్ కి ఉన్న క్రేజ్ హీరో రేంజ్ లోనే ఉందని చెప్పాలి. చూడటానికి హీరో మెటీరియల్. అయిన హీరో కావాలన్న కోరిక లేదు. మంచి క్యారెక్టర్ వస్తే వదలకుండా.. ఒప్పుకున్న క్యారెక్టర్ కి 100 శాతం న్యాయం చేస్తున్నాడు.
కాని కరోనా సోనూసూద్ ని రియల్ లైఫ్ లో హీరోని చేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఎంతగా సేవ చేశారో ప్రతీ ఒక్కరు ప్రత్యక్షంగా చూశారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి, సొంత ఊళ్లకు వెళ్లలేక, పనులు లేక ఆకలి తో అవస్థలు పడుతున్న వందల మంది కూలీలను సొంత ఖర్చులతో బస్సులు, రైళ్ళు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చారు సోనూసూద్. అంతేకాదు ఈ కరోనా కారణంగా ఉద్యోగాలు లేక ఆర్ధిక ఇబ్బందులతో కష్టాల్లో ఉన్నవారికి ఉద్యోగం చూపించాడు.
అంతేకాదు ఆకలి బాధలు పడుతున్నవారిని ఆదుకున్నాడు. ఇలా ఎవరూ ఊహించనంతగా లెక్కలేనంత మందికి సోనూసూద్ సహాయం అందింది. సోషల్ మీడియాలో ఇదిగో పలానా చోట పలానా మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటూ అని ఎవరైనా పోస్ట్ చేస్తే కొన్ని గంటల్లోనే సహాయం చేశాడు సోనూసూద్. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తర్వాత మళ్ళీ సోనూసూద్ ఎలాంటి పరిస్థితి ని లెక్క చేయకుండా తన గురించి కూడా ఆలోచించకుండా దూసుకెళ్ళారు.
సినిమాలలో విలన్ పాత్రలు చేసే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంతో మంది సోనూ నుంచి సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. అందుకే కష్టాల్లో ఉన్నవారు సోనూ దగ్గరికి వెళితే తమ కష్టాలని చెప్పుకుంటే సహాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఈ కారణంగానే హైదరాబాద్ లో జరుగుతున్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా సోనూసూద్ అందరి కష్టాలని విని సహాయం చేస్తానని మాట ఇస్తున్నారట. ఇలాంటి రియల్ హీరో కదా జనాలకి కావల్సింది.