‘ఆర్ఆర్ఆర్’ దానయ్య దయనీయ స్థితికి కారణమేంటి.?

ఆస్కార్ వేడుకలో హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ మాత్రమే కాదు, రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులు సందడి చేశారు. రాజమౌళి సతీమణి, కీరవాణి సతీమణి, రామ్ చరణ్ సతీమణి కూడా వెళ్ళారు. ఇంతకీ, నిర్మాత డీవీవీ దానయ్య ఎక్కడ.? నిర్మాత ఊసే ఎక్కడా ఎందుకు వినిపించలేదు.? రాజమౌళి తన ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూల్లో ఎక్కడా దానయ్య పేరు ప్రస్తావించలేదు. ఎన్టీయార్, రామ్ చరణ్ కూడా అంతే.

‘ఆర్ఆర్ఆర్’ అంటే రాజమౌళి సినిమా. ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా.! అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు.‘నాటు నాటు’ పాటలో చరణ్, ఎన్టీయార్‌తోపాటు మెరిసింది నటి ఒలీవియా మోరిస్. ఆమె పేరూ ప్రస్తావనకు రాలేదు. అవన్నీ ఓ యెత్తు.. అందరికన్నా ముందుండాల్సింది నిర్మాత దానయ్య.! పేరుకే ఆయన నిర్మాత. సినిమా విడుదలయ్యాక అసలెక్కడా దానయ్య పేరే కనిపించలేదు, వినిపించలేదు. అంతా రాజమౌళి మయం.!

చివరికి రాజమౌళి, దానయ్య ఫోన్‌ని కూడా అటెంప్ట్ చేయలేదట ఆస్కార్ అవార్డుల సమయంలో.! ఇంత దయనీయ స్థితికి కారణమేంటి.? రాజమౌళి – దానయ్య మధ్య వైరానికి కారణమేంటి.? పంపకాల్లో తేడాలేనా.?