ఇదేందయ్యో కథ తేడాగా ఉందే.. పవన్ కళ్యాణ్ షర్ట్ దిల్ రాజు వేసుకున్నాడు!

Is Dil raju Wears Pawan Kalyan Shirt

ఇప్పుడు మనం ఉన్నది సోషల్ మీడియా యుగంలో. ఎక్కడ ఏం జరిగినా సరే క్షణాల్లో తెలిసిపోతుంది. గతంలో జరిగిన వాటిని కూడా క్షణాల్లో తవ్వి బయటకు తీస్తారు. అలా కొన్ని ఫోటోలను తవ్వి తీశారు కొంతమంది నెటిజన్లు. నేడు ట్రెండ్ అవుతున్న ఫోటోలను వాటిని దగ్గర పెట్టి ఓ లింక్ క్రియేట్ చేశారు. అది కొందరు తేడాగా ఉందే వ్యవహారాం అని అనుకుంటుంటే.. కొందరు మాత్రం అభిమానమంటే అదే అని కామెంట్లు చేస్తున్నారు.

Is Dil raju Wears Pawan Kalyan Shirt
Is Dil raju Wears Pawan Kalyan Shirt

అయితే నేడు ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించాడు. ఈ మేరకు మెట్రో స్టేషన్‌లో, ట్రైయిన్‌లో పనవ్ కళ్యాణ్ సందడి చేశాడు. అక్కడ క్లిక్ మనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో దిల్ రాజు పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు.

అందరూ పవన్ కళ్యాణ్‌ను చూస్తే కొందరు మాత్రం దిల్ రాజు వేసుకున్న షర్ట్‌ను చూశారు. ఆ షర్ట్ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కూడా వేసుకున్నాడు. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ ఆ షర్ట్ వేసుకున్నట్టు తెలుస్తోంది. అచ్చం అలాంటి డిజైన్,అదే కలర్ షర్ట్ దిల్ రాజు వేసుకోవడంతో ఫ్యాన్ అంటే అలా ఉండాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దిల్ రాజు కథ వేరేలా ఉందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.