పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసి ప్రేక్షకులు దాదాపు మూడేళ్ళు దాటిపోయింది. అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ పవన్ నుంచి సినిమా రాలేదు. రాజకీయాలలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ వరసగా సినిమాలు ప్రకటించాడు. ఆ సినిమాలన్ని ఒక్కొక్కటిగా 2021 లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ కి పవన్ నటించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో ముందు ఈ సీన్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ మూడవ వారం లో లేదా 2021 సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక గబ్బర్ సింగ్ కాంబినేషన్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ లతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాని ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి టాకీపార్ట్ ని మూడు నుంచి నాలుగు నెలల్లోపు కంప్లీట్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ పక్కాగా ప్లాన్స్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఇప్పటికే మొదలైన క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమా 2021 జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళనున్నారు. ఈ సినిమాకి విరూపాక్ష, ఓమ్ శివమ్ అన్న టైటిల్స్ ప్రచారం లో ఉన్నాయి.
ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా 2021 మొదలై 2022 లో రిలీజ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ దర్శకుడికి సూచనలిచ్చాడట. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాం తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపొచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ కి దిల్ రాజు రిలీజ్ డేట్ లాక్ చేశాడట. దసరా పండగ సందర్భాంగా ఆ డేట్ ని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. అందరూ అనుకున్నట్టుగానే పెద్ద పండుగ అయిన సంక్రాంతి బరిలో దింపబోతున్నారట.