మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ అత్యంత దారుణమైన ఫలితాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.! సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం ఓ యెత్తు.. నిర్మాతకీ, హీరోకీ మధ్య గొడవలంటూ జరిగిన ప్రచారం ఇంకో యెత్తు.!
అసలు, ‘భోళా శంకర్’ సినిమా వల్ల వచ్చిన నష్టమెంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. మొత్తం అంతా నష్టమే.. అంటారు కొందరు.! ఓటీటీ వల్ల వచ్చిన లాభం ముందర, నష్టం అసలు లెక్కలో లేనిదంటారు ఇంకొందరు.
ఆ విషయాన్ని పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాపై బెట్టింగ్ మరింత బీభత్సంగా జరిగేందుకు మార్గం సుగమం అయ్యింది. ఏకంగా, 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారట చిరంజీవి తదుపరి సినిమా కోసం.
‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మ్యూజిక్ సిట్టింగ్స్‌తో సినిమా పట్టాలెక్కిందన్నమాట.! ఈ సినిమా కోసం తొలుత 120 కోట్ల వరకూ బడ్జెట్ అనుకున్నా, అదిప్పుడు 200 కోట్లు దాటనుందని తెలుస్తోంది.
ప్రధానంగా గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ బడ్జెట్ అనీ, ‘అంజి’ స్థాయిలో గ్రాఫిక్స్ వుంటుందనీ అంటున్నారు. కానీ, ఏ ధైర్యంతో ఇంత బడ్జెట్ పెడుతున్నారబ్బా.? దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.