గాడ్ ఫాదర్ వెనుక చరణ్ హస్తం ఉందా.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

గాడ్ ఫాదర్ సినిమా ద్వారా తాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నప్పటికీ ఈ సినిమా తెర వెనుక ఉండి నడిపించింది మాత్రం రామ్ చరణ్ అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తనని మలయాళ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాని చూడమని సజెషన్ చేసి తనకి ఈ సినిమాలో నటించమని ఒప్పించారని చిరంజీవి తెలిపారు. అలాగే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడానికి రామ్ చరణ్ కారణమని చిరు తెలిపారు. ఇకపోతే నిర్మాతలు సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో పాటు ఎన్ వి ప్రసాద్ ను ఒక తాటి పైకి తీసుకువచ్చింది కూడా రామ్ చరణ్ అని చిరంజీవి వెల్లడించారు.

ఈ విధంగా లూసిఫర్ సినిమా రామ్ చరణ్ కు నచ్చడంతో తన తండ్రి చేత ఈ సినిమాని చేయించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఈ సినిమా లో నటించిన చిరంజీవి అయినప్పటికీ తెర వెనక ఉండి సినిమాని ముందుకు నడిపించింది మాత్రం రామ్ చరణ్ అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ద్వారా అయినా మంచి విజయం అందుకోవాలని చిత్ర బృందం పెద్ద ఎత్తున అభిమానులకు నచ్చే విధంగా సినిమాని తీర్చిదిద్దారు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.