బాలయ్య సినిమాకి రిపేర్లు.?

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమాకి సంబంధించి ఓ హాటెస్ట్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సినిమా ఔట్ పుట్ కొంత డల్లుగా వుందంటూ ఇప్పటిదాకా జరిగిన షూటింగ్ పార్ట్ విషయమై నందమూరి బాలకృష్ణ కొంత అసంతృప్తితో వున్నారట.

కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంటే, శ్రీలీల ఓ కీల పాత్రలో కనిపించబోతోంది. కాగా, డల్లుగా వున్న సీన్స్ విషయంలో రిపేర్లు తప్పకపోవచ్చని సమాచారం. వాటిని రీషూట్ చేయాలనే ఆలోచనలో వున్నాడట అనిల్ రావిపూడి. అది కూడా బాలయ్య ఆగ్రహంతో.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా.? ఉత్త ప్రచారమేనా.?