టాలీవుడ్ యంగ్ హీరో తో బాలయ్య మల్టీస్టారర్ ..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఈ ఏడాది ప్రారంభంలో అశ్వద్దామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలు లైన్ లో పెడుతు వస్తున్నాడు. ఇక ఇప్పటికే నాగ శౌర్య నటించబోతున్న మూడు సినిమాలకి సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. అందులో ఒకటి ‘వరుడు కావాలెను’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తునారు.

Varudu Kavalenu First Glimpse: Just Above Awesome - tollywood

ఈ సినిమా తర్వాత లక్ష్య అన్న మరో సినిమా చేస్తున్నాడు. ఆకాష్ పూరి తో రొమాంటిక్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘శ్రీకృష్ణ సత్యభామ’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నాగ శౌర్య నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో వెలువడనుందని తెలుస్తోంది.

అదరగొట్టిన నాగశౌర్య 'ల‌క్ష్య'

అయితే తాజా సమాచారం ప్రకారం నాగ శౌర్య – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాని ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా బాలయ్య మంచి మనోజ్ తో ఊకొడతారా ఉలిక్కిపడతారా అన్న సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య యంగ్ డైరెక్టర్స్ అవకాశాలివ్వడంలో ముందు ఉంటారు. ఈ క్రమంలోనే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తాడన్న వార్తలు వస్తున్నాయి.