బేబీకి ఆ ఛాన్స్ నిజమేనా.?

‘బేబీ’ సినిమాతో ఓ మోస్తరు స్టార్ హీరోయిన్ అయిపోయింది తొలి సినిమాకే వైష్ణవీ చైతన్య. డెబ్యూ సినిమానే అయినా తనకున్న సోషల్ మీడియా అనుభవాన్నంతా రంగరించి నటించేసింది ‘బేబీ’ కోసం ఈ ముద్దుగుమ్మ.

ఎంతో బరువైన వేరియేషన్స్ వున్న పాత్ర అయినప్పటికీ ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా పర్‌ఫామ్ చేసిన వైష్ణవీ నటనకు తెలుగు మేకర్లు ఫిదా అయిపోయారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ నేపథ్యంలోనే ఆమెకు అవకాశాలు పోటెత్తుతున్నాయనీ సమాచారం. ఇప్పటికే ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను సంప్రదించాడట.

అయితే, ఆ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ చేయలేదట వైష్ణవీ చైతన్య. యూత్‌కి కావల్సిన కంటెంట్‌ని ఇవ్వడానికి ఎటువంటి మొహమాటాలూ తనకు లేవని తొలి సినిమాతోనే చెప్పకనే చెప్పేసింది వైష్ణవీ చైతన్య.

బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కొల్లగొట్టడానికి ఇంతకన్నా కావల్సిందేముంటుంది. అందుకే ఓ సెన్సేషనల్ హీరో సినిమా కోసం వైష్ణవీ చైతన్యను తీసుకోవాలని అనుకుంటున్నారట.

అయితే, అప్పుడే వైష్ణవికి అంత బెటర్ ఛాన్స్ ఇచ్చేయడం అవసరమా.? అంటూ కొందరు డీ మోటివేట్ చేస్తున్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్.

అయితే, స్టార్‌డమ్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదుగా. ఏ టైమ్‌లో ఎవరి స్టార్ ఎలా తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. అలాగే ‘బేబీ’ సినిమాతో ఆల్రెడీ వైష్ణవీ చైతన్య స్టార్ టర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.