మహేష్ సినిమాలో అకిరా.. అంత సీన్ లేదమ్మా!

Akira Nandan in Mahesh Babu Production

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెండితెరకు పరిచయం కావాల్సిన నట వారసులు చాలామంది ఉన్నారు. అగ్ర హీరోల తనయులు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా ఉన్నాడు. జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అందుకు కారణం అకిరా హైట్.

Akira Nandan in Mahesh Babu Production
Akira Nandan with Adavi Sesh

అకిరా నందన్ ఇంకా 18లోకి కూడా రాలేదు. అప్పుడే 6’4 హైట్ తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో అందరికంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారిలో వరుణ్ తేజ్ ఉన్నాడు. ఇక అన్న వరుణ్ కంటే కూడా అకిరా కొంచెంలో కొంచెం హైట్ ఉన్నాడని క్లారిటీ వచ్చేసింది. దీంతో అకిరా ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నార్మల్ గా ఎంట్రీ ఇప్పిస్తే మాత్రం అభిమానులు కూడా ఒప్పుకోరు. అయితే మహేష్ బాబు ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమాలో అకిరా స్పెషల్ పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో అడవి శేష్ మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక G మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మిస్తుండగా శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమాలో అకిరా స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అడవి శేష్ అకిరాకు క్లోజ్ ఫ్రెండ్ కావడం వలన అలా అనుకోకుండా కాంబో సెట్టయ్యిందని అంటున్నారు గాని నిజానికి అలాంటిదేమి లేదను తెలుస్తోంది. అకిరాను అలా సింపుల్ గా సపోర్టింగ్ రోల్ తో పరిచయం చేస్తే అభిమానులు ఎంత మాత్రం ఒప్పుకోలేరు. మరి రేణు దేశాయ్ ఈ విషయంపై ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.