నిహారిక పెళ్ళికి హాజ‌ర‌య్యేవారికి క‌రోనా ప‌రీక్ష‌లు.. స‌పోర్ట్ చేయాలంటున్న మెగా ఫ్యామిలీ

డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న నిహారిక-చైత‌న్య పెళ్ళికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. మ‌రి కొద్ది గంట‌ట‌లో మెగా ఫ్యామిలీ అక్క‌డికి బ‌య‌లు దేర‌నుంది. మెహందీ, సంగీత్ కార్య‌క్ర‌మాల‌లో వీరంద‌రు పాల్గొన‌డంతో పాటు ఎప్ప‌టికి గుర్తుండిపోయేలా సందడి చేయ‌నున్నార‌ట‌. ఎంగేజ్‌మెంట్‌కు హాజ‌రు కాలేక‌పోయిన ప‌వ‌న్ కూడా ఈ రోజు లేదంటే రేపు రాజ‌స్థాన్ వెళ్ళ‌నున్నారు. చాలా కాలం త‌ర్వాత మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేర‌నుండ‌డంతో ఆ ప్రాంతం కోలాహాలంగా మార‌నుంది.

నిహారిక పెళ్ళికి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల‌తో పాటు ప‌లువురు అతిథులు హాజ‌రు కానున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌ల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నార‌ట‌. ఈ ప‌రీక్ష‌లకి ప్ర‌తి ఒక్క‌రు స‌పోర్ట్ చేయాల‌ని మెగా ఫ్యామిలీ ఉంటుంది. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ న‌డుస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఆ కుటుంబం భావిస్తుంది. డిసెంబ‌ర్ 9న పెళ్లి పూర్తైన త‌ర్వాత డిసెంబ‌ర్ 11న జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌లో రిసెప్ష‌న్ గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ, రాజ‌కీయ, టీవీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

నిహారిక పెళ్లికి గిఫ్ట్ ఇచ్చేందుకు చిరంజీవి కోటిన్న‌ర విలువ గ‌ల న‌గ‌ని త‌యారు చేయించాడ‌నే టాక్ న‌డుస్తుంది. వరుణ్ తేజ్ కూడా చెల్లి కోసం భారీగానే గిఫ్టులు ఇస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్లు కూడా తమ ఇంటి ఆడపడుచుకు భారీ బహుమతులు ఇస్తున్నారు. అల్లుడికి కూడా చిరు ఓ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడ‌నే టాక్ న‌డుస్తుంది. అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న పెళ్లి వేడుక‌కి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయ‌ని అంటున్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ దృష్టి పెడుతున్నారు.