ఎన్టీయార్ సినిమాలో ఆ డోస్ ఎక్కువగా వుండనుందట.!

ఎన్టీయార్ 30 సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై షూటింగ్ జరుగుతోంది. కాగా, ఈ సినిమా గురించి ఓ సరికొత్త ప్రచారం తెర వెనక వినిపిస్తోంది. ఈ సినిమాకి పొలిటికల్ టచ్ ఎక్కువగా వుండబోతోందట.

వాడి వేడిగా పొలిటికల్ పంచ్‌లు విసరబోతున్నాడట ఎన్టీయార్. సహజంగానే కొరటాల సినిమాల్లో పొలిటికల్ డైలాగులు ఎక్కువగా వుంటాయ్. ‘భరత్ అనే నేను’ సినిమాలో పొలిటికల్ పంచ్‌లు మామూలుగా పడలేదు. ఆ టైమ్‌లో వైసీపీ ఆ డైలాగుల్ని బాగా వాడేసింది.

ఇప్పుడు కూడా పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు సిద్ధం చేశాడట కొరటాల. అయితే, ఆ డైలాగులు వైసీపీకి అనుకూలమా.? లేక టీడీపీకి అనుకూలంగా వుంటాయా.? అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.

ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం రెండు పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు మాత్రం బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయనీ తెలుస్తోంది.