బాలయ్య కోసం మరో పవర్ఫుల్ టైటిల్

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ప్రస్తుతం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలకృష్ణ ఈ సినిమాలో తెలంగాణ యాసలో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పబోతున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలయ్యతో ఆమెకిది మొదటి చిత్రం కావడం విశేషం. పెళ్లి తర్వాత తెలుగులో కాజల్ చేస్తోన్న సినిమా కూడా ఇదే. ఇదిలా ఉంటే ఈ మూవీలో యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఆమె చేయబోయే పాత్ర ఏంటి అనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక బాలయ్య స్టైల్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి నుంచి ఎక్స్ పెక్ట్ చేసే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీపై అనిల్ రావిపూడి చాలా సందర్భాలలో హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు అనిల్ రావిపూడి ఇంటరెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేసారని తెలుస్తోంది.

భగవత్ కేసరి అనే టైటిల్ ని మూవీకి ఖరారు చేసారంట. ఇక దీనికి ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ సౌండ్ పరంగా బాలయ్యకి పెర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలానే ఉంది. ఎక్కువగా పంజాబ్ రాష్ట్రంలో పేరు చివరి కేసరి అనేది ఉంటుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన పంజాబీలలో చాలా మంది కేసరి అనేది వారసత్వంగా వస్తోంది.

అలాంటి ఇంటరెస్టింగ్ టైటిల్ ని ఇప్పుడు బాలయ్య కోసం అనిల్ రావిపూడి ఖరారు చేయడం నందమూరి ఫ్యాన్స్ కి ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ఇక జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ తో పాటు టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందంట. మరి ఈ టైటిల్ ని సినిమాకి ఎ పాయింట్ లో ఖరారు చేసారనేది తెలియాలంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.