బాలయ్య సినీ రాజకీయం మామూలుగా వుండదు.!

బాలయ్య తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’లో పొలిటికల్ డైలాగ్స్ వున్నాయట. చాలా పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ అనీ తెలుస్తోంది. అయితే, వాటిని ఏమాత్రమూ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట.

ఆల్రెడీ షూట్ చేసి హోల్డ్‌లో పెట్టి వుంచారట. సినిమాలో అవసరాన్ని బట్టి ఆ డైలాగ్స్‌ని వాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు నుంచి నాలుగు వరకూ పొలిటికల్ డైలాగ్స్ ఈ సినిమాలో వున్నాయనీ తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాలంటే సహజంగానే హ్యూమరస్‌గా వుంటాయ్.

అలాంటిది బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా.. అంటే మరోలా ఊహించుకోవడం సహజమే. అయితే, హ్యూమరస్‌తో పాటూ, బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీరియస్ మోడ్ కూడా ఈ సినిమాలో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడట.

శ్రీలీల ఈ సినిమాలో బాలయ్యకి కూతురుగా నటిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.