ఇంట్రెస్టింగ్ గాసిప్..”ఓజి” లో పవన్ కి ఇన్ని రోజులేనా?

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న పలు సెన్సేషనల్ కాంబినేషన్ లు మరియు సినిమాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ దర్శకుడు సుజీత్ లు చేస్తున్న పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ డ్రామా ఓజి – ది ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కూడా ఒకటి.

మరి ఈ సాలిడ్ సినిమా అయితే భారీ అంచనాలు నెలకొల్పుకోగా పవన్ జెట్ స్పీడ్ లో ఈ సినిమాని కూడా కంప్లీట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కి కూడా మేకర్స్ రంగం సిద్ధం చేస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ కొన్ని ట్రస్టడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. దీని ప్రకారం ఐతే ఈ సినిమాకి పవన్ 50 రోజుల లోపే డేట్స్ ని కేటాయించారట.

అంటే సుమారు 42 నుంచి 45 రోజుల్లోనే పవన్ కనిపించే పోర్షన్స్ తాలూకా షూటింగ్ జరిగిపోతుంది అని తెలుస్తుంది. మరి ఈ తరహా బిగ్ ఏక్షన్ ఎంటర్టైనర్ కి పవన్ నుంచి అన్ని తక్కువ రోజులు అంటే ఆశ్చర్యకరమే అని చెప్పాలి. అలాగే ఈ ఇన్ని రోజుల్లో కూడా సుజీత్ పవన్ నుంచి ఎంత పనితనం రాబట్టుకున్నాడు అనేది కూడా కీలకం అనుకోవాలి.

అలాగే ఈ సినిమాలో అయితే యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా ఇక ఈ మాసివ్ ఏక్షన్ ఎంటర్టైనర్ ని అయితే థమన్ సంగీతం అందిస్తుండగా ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.