యష్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు సినిమా టైటిల్‌ ప్రకటన!

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు కన్నడ హీరో యష్‌. ‘కేజీఎఫ్‌`2’ తర్వాత ఆయన తదుపరి సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్‌ చేయబోయే సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది.

‘యష్‌`19’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా అప్‌డేట్‌ను అందించారు యష్‌. డిసెంబర్‌ 8న ఈ సినిమా టైటిల్‌ ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడి వివరాలను యష్‌ వెల్లడించనప్పటికీ.. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వ బాధ్యతలను తీసుకోనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా లొకేషన్‌ సెర్చ్‌ కోసం యష్‌ శ్రీలంకలో పర్యటిస్తున్నట్లు సమాచారం