ఆయనతో సినిమా చేస్తే సౌందర్య కెరీర్ ఖతం అన్నారట.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి ఎవరనే ప్రశ్నకు సౌందర్య పేరు సమాధానంగా వినిపిస్తుంది. తెలుగులో దాదాపుగా అందరు అలనాటి స్టార్ హీరోలకు జోడీగా సౌందర్య నటించారు. అయితే కెరీర్ తొలినాళ్లలో బాబు మోహన్ తో కలిసి సౌందర్య నటించాల్సి రాగా బాబు మోహన్ తో కలిసి నటిస్తే సౌందర్య కెరీర్ ఖతం అవుతుందని ఆమెను చాలామంది భయపెట్టారు.

చాలా సంవత్సరాల క్రితం బాబు మోహన్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు. తర్వాత కాలంలో రాజకీయాలతో బాబు మోహన్ బిజీ కావడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు బాబు మోహన్ నటనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చినుకుచినుకు అందెలతో సాంగ్ లో తనతో కలిసి డ్యాన్స్ చేస్తే సౌందర్య కెరీర్ పోతుందని చాలామంది కామెంట్ చేశారని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. సౌందర్య మాత్రం తనతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఆసక్తి చూపారని బాబు మోహన్ కామెంట్లు చేశారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు నేను ఉంటే నటించమని చెప్పారని బాబు మోహన్ వెల్లడించారు. బాబు మోహన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మామగారు సినిమాలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కలిసి నటించారనే సంగతి తెలిసిందే. బాబు మోహన్ కామెడీతో పాటు విలనిజాన్ని తనదైన శైలిలో పండించడం గమనార్హం. 60కు పైగా సినిమాలలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కలిసి నటించడం గమనార్హం. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. పలు సినిమాలలో బాబు మోహన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.