Pushpa Part 2 : ఇండస్ట్రీ బజ్ : “పుష్ప పార్ట్ 2” కి రష్మికా అప్పుడు జాయిన్ అవ్వుద్దట.!

Pushpa Part 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లాస్ట్ అండ్ లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప పార్ట్ 1 క్రేజ్ ఇంకా కూడా ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలిసిందే. పాటల్లో గాని డైలాగ్స్ గాని ఓ రేంజ్ లో ఈ సినిమా సృష్టించిన మ్యానియా కొనసాగుతుంది. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మికాలతో దర్శకుడు సుకుమార్ పూర్తిగా మార్చేసిన సంగతి చూసాము.
అప్పటి వరకు మంచి కలర్ లో గ్లామరస్ గా కనిపించే ఈ ఇద్దరినీ మేకప్ తో డీ గ్లామరస్ గా చేసి కొత్తగా చూపించాడు. అయితే ఇప్పుడు సినిమా పార్ట్ 2 పై కొన్ని అప్డేట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ని ఇప్పుడు ఫైనల్ చేసే పనిలో ఉండగా మరోపక్క ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కి గాను డేట్ కూడా పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ రశ్మికా ఎప్పుడు జాయిన్ అవుతుందో సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈమె ఆగష్టు నెలలో సినిమా షూటింగ్ కి హాజరు అవుతుందట ఆ గ్యాప్ లో అల్లు అర్జున్ పై అలాగే ఇతర షూటింగ్స్ ని సుకుమార్ చేస్తారని వినికిడి.
మరి దీనిలో ఎంతమేర నిజముంది వేచి చూడాలి. ఆల్రెడీ ఈ సినిమాకి పార్ట్ 1 కన్నా ఎన్నో రెట్లు సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫహద్ ల క్లాష్ గట్టిగా ఉంటుంది అని అంటున్నారు మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.