ఇన్సైడ్ టాక్ : “వాల్తేరు వీరయ్య”లో రవితేజ టీజర్ విజువల్స్ ఇవే.!

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మరో మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ చిరంజీవి సహా మాస్ మహారాజ రవితేజ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. అయితే మెగాస్టార్ ఫుల్ లెంగ్త్ లో ఈ సినిమాలో కనిపించనుండగా రవితేజ అయితే సుమారు 40 నిమిషాల గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా అంతకంతకు మంచి అంచనాలు పెంచుకుంటూ వెళ్తుండగా ఇప్పటికే మెగాస్టార్ పై టీజర్ ఒకటి వచ్చింది. ఇక నెక్స్ట్ అంతా రవితేజ టీజర్ కోసం చూస్తూ ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తన టీజర్ పై వినిపిస్తుంది.

మెగా ఫ్యాన్ వర్గాలు చెప్తున్నా దాని ప్రకారం అయితే చేతిలో గొడ్డలితో మేడలో మేకపిల్లని వేసుకొని మరో చేతిలో గ్యాస్ బండ ఈడ్చుకుంటూ వచ్చి సరైన మాస్ మసాలా ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ విజువల్స్ డెఫినెట్ గా వాల్తేరు వీరయ్య నుంచి ఉండనున్నాయని ఇప్పుడు గాసిప్స్.

మరి ఇది రవితేజ నుంచి ఉంటుందా లేక మెగాస్టార్ పైనే ఉంటుందా అనేది జస్ట్ కొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు అలాగే డీఎస్పీ సంగీతం అందిస్తున్నాడు.