ఇన్సైడ్ టాక్ : బాలయ్యతో గ్రాండ్ ప్లాన్ చేస్తున్న స్టార్ ఓటిటి సంస్థ.!

మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరోసారి అయితే తన కెరీర్ లో పీక్ స్టేజ్ ని చూస్తున్నారని చెప్పాలి. కాగా ఇప్పుడు బాలయ్య అయితే అటు వెండితెర మీద అలాగే ఇంట్రెస్టింగ్ గా ఓటిటి లో కూడా భారీ సక్సెస్ అయ్యి అదరగొడుతున్నారు.

దీనితో రెండు రకాలుగా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న తాను ఇప్పుడు తన కెరీర్ 108వ సినిమా చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్ పోస్టర్ లు కూడా కేక పుట్టించే రెస్పాన్స్ ని అందుకోగా ఇక బాలయ్య ఓటిటి వార్తలు కొన్ని ఎగ్జైటింగ్ గా ఉన్నవి వినిపిస్తున్నాయి.

మరి ఈ సారి ఆహా వారు కాకుండా వరల్డ్ పాపులర్ స్టార్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు అయితే బాలయ్య తో గ్రాండ్ ప్లాన్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ ఇన్సైడ్ టాక్. అంతే కాకుండా వారు బాలయ్య తో టాక్ షో లాంటిది ఏమి ప్లాన్ చేయకుండా ఏకంగా భారీ వెబ్ సిరీస్ లాంటి దానినే ప్లాన్ చేస్తున్నారట.

దీనితో అయితే బాలయ్య నుంచి ఓ క్రేజీ వెబ్ సిరీస్ ని మనం ఆశించవచ్చని చెప్పాలి. కాగా ఇదెప్పుడు నుంచి ఉంటుంది అని ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే బాలయ్య అనీల్ సినిమాలో బిజీగా ఉండగా మరోపక్క పాలిటిక్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.